
ఢిల్లీ, 19 జనవరి (హి.స.)
చార్‌ధామ్ యాత్రకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్. ఈ యాత్ర నేపథ్యంలో తాజాగా ఉత్తరాఖండ్ ( Uttarakhand) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చార్‌ధామ్ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు.. అదే సమయంలో సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది. ఆలయాలలోకి మొబైల్స్, కెమెరాలు తీసుకువెళ్లడంపై తాజాగా నిషేధం విధిస్తూ ప్రకటన చేసింది ఉత్తరాఖండ్ సర్కార్.
వీటి వినియోగంతో దర్శన సమయంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది. మొబైల్స్, కెమెరాలు సేఫ్ గా ఉంచడానికి టెంపుల్స్ వద్ద అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ పడకూడదని పేర్కొన్నారు. ఈ యాత్రలో జాగ్రత్తలు పాటిస్తూ.. ముందుకు సాగాలని పేర్కొంది సర్కార్. అపరిచితులను అస్సలు నమ్మకూడదని కోరింది.
చార్‌ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఎలా అంటే ?
చార్‌ధామ్ యాత్రలో భాగంగా ఆలయాలు అక్షయ తృతీయ రోజున తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 19వ తేదీన యమునోత్రితో ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు వెళ్లేవారు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది అందరికీ ఉచితంగానే అందిస్తున్నారు. మార్చి 2026 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV