ప్రీ-వెడ్డింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 125 మందికి అస్వస్థత
ముంబై,19, జనవరి (హి.స.) మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్ ప్రాంతంలో జరిగిన ప్రీ-వెడ్డింగ్(హల్దీ) కార్యక్రమం విషాదంగా మారింది. విందులో వడ్డించిన ఆహారం తిన్న తర్వాత సుమారు 125 మందికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయి. వారందరికీ ఒక్కసారిగా వాంతులు
ప్రీ-వెడ్డింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 125 మందికి అస్వస్థత


ముంబై,19, జనవరి (హి.స.) మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్ ప్రాంతంలో జరిగిన ప్రీ-వెడ్డింగ్(హల్దీ) కార్యక్రమం విషాదంగా మారింది. విందులో వడ్డించిన ఆహారం తిన్న తర్వాత సుమారు 125 మందికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయి. వారందరికీ ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి, వికారం రావడంతో వేడుకలో కలకలం రేగింది.

బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చికిత్స అనంతరం చాలామంది పరిస్థితి నిలకడగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కార్యక్రమానికి ఆహార పదార్థాలు సరఫరా చేసిన క్యాటరింగ్ సర్వీస్ నిర్వాహకులను విచారిస్తున్నట్లు సమాచారం. ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపించి ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలను నిర్ధారించే ప్రయత్నాలు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande