సమయం ఆసన్నమైంది.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ కీలక పోస్ట్‌
ఢిల్లీ,19,, జనవరి (హి.స.)వనరుల పరంగా ఎంతో కీలక దీవి అయిన గ్రీన్‌లాండ్‌ (Greenland)ను చేజిక్కించుకుంటామంటూ ట్రంప్‌ (Trump) చేస్తున్న హెచ్చరికలను గ్రీన్‌లాండ్‌, డెన్మార్క్‌లతో పాటు ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డెన్
Donald Trump


ఢిల్లీ,19,, జనవరి (హి.స.)వనరుల పరంగా ఎంతో కీలక దీవి అయిన గ్రీన్‌లాండ్‌ (Greenland)ను చేజిక్కించుకుంటామంటూ ట్రంప్‌ (Trump) చేస్తున్న హెచ్చరికలను గ్రీన్‌లాండ్‌, డెన్మార్క్‌లతో పాటు ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డెన్మార్క్‌ (Denmark)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌లాండ్‌ భద్రతకు రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని నాటో 20 ఏళ్లుగా చెబుతున్నా డెన్మార్క్‌ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. రష్యాను ఎదుర్కోవడంలో అది విఫలమవడంతో భద్రతా కారణాల దృష్ట్యా తాము ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సమయం వచ్చింది కాబట్టే ఈ విషయంలో తాము కల్పించుకున్నామన్నారు. ఎలాగైనా గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకుంటామన్నారు.

గ్రీన్‌లాండ్‌ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్‌ చేసిన ప్రకటనపై బ్రిటన్‌తోపాటు ఈయూ దేశాలు మండిపడడంతో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా చర్యలపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌ బెదిరింపులకు లొంగేది లేదని, గ్రీన్‌లాండ్‌ ఎప్పటికీ డెన్మార్క్‌లో భాగమేనని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande