కొత్త మలుపు తిరిగిన ‘ముంబై మేయర్‌’ పంచాయితీ
ముంబై,19, జనవరి (హి.స.) బృహణ్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) మేయర్‌ పదవి ఎవరికి దక్కుతుందో ఇంకా తేలలేదు. ఒకవైపు మహాయుతి కూటమిలో ఏ పార్టీ తరపు ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందో? అనే సస్పెన్స్‌ కొనసాగుతుండగా.. మరోవైపు ఏదైనా అద్భుతంగా జరిగి అనూహ్యంగా
Eknath Shinde


ముంబై,19, జనవరి (హి.స.) బృహణ్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) మేయర్‌ పదవి ఎవరికి దక్కుతుందో ఇంకా తేలలేదు. ఒకవైపు మహాయుతి కూటమిలో ఏ పార్టీ తరపు ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందో? అనే సస్పెన్స్‌ కొనసాగుతుండగా.. మరోవైపు ఏదైనా అద్భుతంగా జరిగి అనూహ్యంగా విపక్ష కూటమికి వెళ్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అధికార కూటమిలో చర్చలు కొనసాగుతుండగానే.. ఈలోపు షిండే శివసేన హోటల్‌ రాజకీయాలకు తెర తీసింది.

మొన్నటిదాకా పవర్‌ షేరింగ్‌ ఫార్ములాను ప్రస్తావిస్తూ చెరో రెండున్నరేళ్లు మేయర్‌ పదవి కోసం డిమాండ్‌ చేసిన షిండే సేన.. ఇప్పుడు స్వరం మార్చింది. మేయర్‌ పదవి మొదటి సంవత్సరం మాత్రం కచ్చితంగా తమకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 23న బాలాసాహెబ్‌ థాక్రే శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని షిండే సేన భావిస్తోంది. ఈ క్రమంలో కూటమి తరఫున తొలి ఏడాది మేయర్‌ పదవి దక్కించుకోవడం ద్వారా థాక్రేకు ఘనంగా నివాళి సమర్పించాలని బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.

ఇప్పటికే రేసులో యామిని జాధవ్‌, తృష్ణా విశ్వస్రావో, అమేయ్‌ ఘోలే వంటి యువ, అనుభవజ్ఞుల పేర్లను మేయర్‌ రేసు కోసం పరిశీలిస్తోంది. బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన మేయర్‌ ఉన్నందున.. తమ వర్గమే అసలు శివసేన అని నిరూపించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్‌ అని ఏక్‌నాథ్‌ షిండే భావిస్తున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande