G RAM G చట్టంపై రాహుల్, ఖర్గేలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సవాల్
ఢిల్లీ, 19 జనవరి (హి.స.) కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ''వికసిత్ భారత్-గ్రామ్ జీ'
శివరాజ్ సింగ్


ఢిల్లీ, 19 జనవరి (హి.స.)

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 'వికసిత్ భారత్-గ్రామ్ జీ' (G RAM G) చట్టంపై ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వారిది ఒక అబద్ధాల షాపు అని ఆయన విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ ఏఐ (AI) ద్వారా సృష్టించిన నకిలీ చిత్రాలను వాడుతోందని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదని ఆయన హితవు పలికారు. అలాగే పార్లమెంట్‌లో ఈ చట్టంపై సుదీర్ఘ చర్చ జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు.

ఈ కొత్త చట్టం గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు, రైతులకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. పాత ఉపాధి హామీ పథకంలో ఉన్న లోపాలను సవరించి, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడమే కాకుండా, పారదర్శకమైన నిధుల పంపిణీకి ఈ చట్టం హామీ ఇస్తుందని ఆయన వివరించారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్లో నిజం లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే వారు 'సంగ్రామ్' వంటి పదాలను వాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి చౌహాన్ విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande