గుంతకల్లు నుంచి. బెంగళూరు చెన్నై విజయవాడ డే ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరించాని కారణంగా.జిల్లా ప్రజల ఇబ్బంది
గుంతకల్లు, 02 జనవరి (హి.స.) :గుంతకల్ల నుంచి బెంగళూరు, చెన్నై, విజయవాడ డే ప్యాసింజరు రైళ్లు పునరుద్ధరించని కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్ల కిందట గుంతకల్లు-ఎగ్మోర్‌ (చెన్నై), యశ్వంతపూర్‌-విజయవాడ (56503/04), గుంతకల్లు-గుల్బర్గా ప్యా
గుంతకల్లు నుంచి. బెంగళూరు చెన్నై విజయవాడ డే ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరించాని కారణంగా.జిల్లా ప్రజల ఇబ్బంది


గుంతకల్లు, 02 జనవరి (హి.స.)

:గుంతకల్ల నుంచి బెంగళూరు, చెన్నై, విజయవాడ డే ప్యాసింజరు రైళ్లు పునరుద్ధరించని కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్ల కిందట గుంతకల్లు-ఎగ్మోర్‌ (చెన్నై), యశ్వంతపూర్‌-విజయవాడ (56503/04), గుంతకల్లు-గుల్బర్గా ప్యాసింజరు రైళ్లు నడిచేవి. కరోనా సీజన్‌ పూర్తయిన తర్వాత పలు ప్యాసింజరు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పునరుద్ధరించినా ఈ ప్యాసింజరు రైళ్లను పట్టాలెక్కించలేదు. గుంతకల్లు-తిరుపతి, గుంతకల్లు-కాచిగూడ, గుంతకల్లు-రాయచూరు ప్యాసింజర్లను మాత్రమే పునరుద్ధరించారు. దీంతో బెంగళూరు, విజయవాడ, చెన్నై వెళ్లే జిల్లా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గుంతకల్లు నుంచి బెంగళూరు మధ్య ప్యాసింజరును నడపాలంటూ స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నా రైల్వే శాఖ పెడచెవిన పెడుతూ వస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande