
అమరావతి, 02 జనవరి (హి.స.)
కృష్ణాజిల్లా, ): మచిలీపట్నం పోర్టు ఒక సంవత్సరంలో పూర్తి అవుతుందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ) వ్యాఖ్యానించారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇవాళ(శుక్రవారం) కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పలు కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. దాదాపు రూ.400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నామని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ