ఖమ్మం.జిల్లా పెనుబల్లి మండలం.గణేష్ పాడు వద్ద స్కూల్. బస్సు బోల్తా
ఖమ్మం, 02 జనవరి (హి.స.) పెనుబల్లి మండలం గణేశ్‌పాడు వద్ద స్కూల్‌ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. వేంసూరు మండలం మద్దులగూడెంలోని వివేకానందా విద్యాలయం నుంచి సుమారు వంద మంది విద్యార్థులతో గణేశ్‌పాడు, ఎల్‌ఎస్‌ బంజరు, కేఎం బంజరు, మార్లకుంట, ముత్తు
ఖమ్మం.జిల్లా పెనుబల్లి మండలం.గణేష్ పాడు వద్ద స్కూల్. బస్సు బోల్తా


ఖమ్మం, 02 జనవరి (హి.స.) పెనుబల్లి మండలం గణేశ్‌పాడు వద్ద స్కూల్‌ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. వేంసూరు మండలం మద్దులగూడెంలోని వివేకానందా విద్యాలయం నుంచి సుమారు వంద మంది విద్యార్థులతో గణేశ్‌పాడు, ఎల్‌ఎస్‌ బంజరు, కేఎం బంజరు, మార్లకుంట, ముత్తుగూడెం తదితర గ్రామాలకు బయలుదేరింది. గణేశ్‌పాడు గ్రామ శివారులోకి రాగానే.. డ్రైవర్‌ వేగంగా బస్సు నడపంతో అదుపుతప్పి కాల్వలోకి పల్టీ కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 40మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను విద్యార్థుల తల్లిదండ్రులు, వీఎం బంజరు పోలీసులు.. పెనుబల్లి, ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులోని ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande