
అమరావతి, 02 జనవరి (హి.స.)సంక్రాంతి సందర్భంగా టోల్‌ప్లాజాలో టోల్ వసూళ్లను నిలిపివేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టీడీపీ ఎంపీ సనా సతీష్ కోరారు. సంక్రాంతికి హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఏపీలోని సొంత గ్రామాలకు వస్తారని.. ఫలితంగా హైదరాబాద్-విజయవాడ రహదారిపై విపరీతమైన రద్దీ ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టోల్ వసూళ్లు నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ