మూసీ పునరుద్ధరణపై వాడీవేడి చర్చ.. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
హైదరాబాద్, 02 జనవరి (హి.స.) తెలంగాణ శాసనసభలో ఇవాళ మూసీ ప్రక్షాళనపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మూసీ పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించి ప్రాజెక్టు ఉద్దేశాలు, లక్ష్యాలను సభకు వివరించారు. ఆయన ప్రసంగం అనంతరం
బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్


హైదరాబాద్, 02 జనవరి (హి.స.)

తెలంగాణ శాసనసభలో ఇవాళ మూసీ

ప్రక్షాళనపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మూసీ పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించి ప్రాజెక్టు ఉద్దేశాలు, లక్ష్యాలను సభకు వివరించారు. ఆయన ప్రసంగం అనంతరం సభలో తమ గళాన్ని వినిపించడానికి, ముఖ్యంగా ప్రజా సమస్యలపై చర్చించడానికి తమకు అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. సభ లోపల ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తున్నారని వారు అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా సీఎం మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నేతలకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందని.. స్పీకర్ తమకు మైక్ ఇవ్వకపోవడం దుర్మార్గమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande