
హైదరాబాద్, 02 జనవరి (హి.స.)
మూసీ ప్రక్షాళన కావాలా.. వద్దా? అని
సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభ్యలను అసెంబ్లీలో ప్రశ్నించారు. ఇవాళ మూసీ పునరుద్ధరణపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని కామెంట్ చేశారు. మూసీలో ఉండే కాలుష్యం కంటే.. కొంతమంది కడుపులో విషం ఎక్కువ ఉందని సెటైర్లు వేశారు. తాము మూసీ ప్రక్షాళనపై వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే విషం కక్కుతున్నారని విపక్ష సభ్యులకు చురకలంటించారు. ప్రజలకు ప్రభుత్వం చేసేది తెలియొద్దు అనేది వాళ్లు ఉద్దేశమని మండిపడ్డారు. అవతలి వాళ్లు మాడిపోయేలా కొందరి చూపులు ఉన్నాయని.. అసలు మూసీ ప్రక్షాళన కావాలా.. వద్దా? అని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..