రాజకీయ నాయకుడికి గెలవడమే అంతిమ గీటురాయి.. ఈటెల రాజేందర్
మేడ్చల్ మల్కాజిగిరి, 02 జనవరి (హి.స.) మున్సిపల్ ఎన్నికల నేతృత్వంలో ఎంపీ ఈటెల రాజేందర్ మల్కాజ్గరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో ''మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం'' నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడికి గెలవడమే అంతి
ఈటెల రాజేందర్


మేడ్చల్ మల్కాజిగిరి, 02 జనవరి (హి.స.)

మున్సిపల్ ఎన్నికల నేతృత్వంలో ఎంపీ ఈటెల రాజేందర్ మల్కాజ్గరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో 'మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడికి గెలవడమే అంతిమ గీటురాయి అని అన్నారు. సుపరిపాలన, ప్రజలు మెచ్చే పాలన అందించడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. మన పరివార క్షేత్రాలు అనేక సమస్యల మీద కొట్లాడుతాయి.. కానీ వాటిని పరిష్కరించే సత్తా అధికారంలోకి వస్తేనే ఉంటుందని నొక్కి చెప్పారు. అనేక సంవత్సరాల స్వప్నం 370 ఆర్టికల్ రద్దు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటంవల్లనే సాధ్యమైందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande