
హైదరాబాద్, 02 జనవరి (హి.స.) తెలంగాణ శాసనసభ శీతాకాల
సమావేశాలు రెండో రోజు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభలో భారీ నిరసనకు దిగింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ఎల్పీ నేతలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించారు. 'కాంగ్రెస్ వచ్చింది.. రైతులను నిండా ముంచింది' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైతులకు సకాలంలో యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సరఫరాను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. యూరియా కొరతపై చర్చ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని అందజేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు