ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, 02 జనవరి (హి.స.) కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించ
భద్రాద్రి కలెక్టర్


భద్రాద్రి కొత్తగూడెం, 02 జనవరి (హి.స.)

కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించరాదని అధికారులకు సెక్యూరిటీ గార్డ్ కు తెలిపారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లు సంతకం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande