
హైదరాబాద్, 02 జనవరి (హి.స.)
నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి
శరవేగంగా జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మూసీ పునరుద్ధరణపై సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం దాదాపు 240 కి.మీ ప్రవహిస్తుందని తెలిపారు. మూసీ, ఈసా నదులు కలిసే చోటు బాపూఘాట్ ఉందని.. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..