
హైదరాబాద్, 02 జనవరి (హి.స.)
నగరంలోని ప్రధాన పర్యాటక
ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎ ఎస్ మాజీ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు చెరువు భూమిని కబ్జా చేసి అక్రమంగా దందాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై హైడ్రా ఇచ్చిన ఫిర్యాదుతో తాజాగా మాదాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలోని సుమారు 5 ఎకరాల శిఖం భూమిని ప్రభాకర్ రెడ్డి అనుచరులు మట్టి, రాళ్లతో నింపి చదును చేశారు. అనంతరం ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రైవేట్ బస్సులు, ఐటీ కంపెనీల వాహనాలకు పార్కింగ్ లాట్ నిర్వహిస్తూ నెలకు సుమారు రూ.50 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లుగా హైడ్రా పాథమిక విచారణలో వెల్లడైంది.
2014 నుంచే దుర్గం చెరువు ఆక్రమణలు మొదలైనట్లుగా హైడ్రా అధికారులు ఆరోపిస్తున్నారు. 10 నుంచి 15 మీటర్ల మేర లోతుగా మట్టిని నింపి అక్రమంగా స్థలాన్ని సృష్టించారని అధికారులు గుర్తించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు