
కరీంనగర్, 02 జనవరి (హి.స.)
తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల
విషయంలో జరిగిన అన్యాయానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలే ప్రధాన కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేయడం ఆ రెండు పార్టీలకు అలవాటుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో అబద్ధాల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో ఆ రెండు పార్టీలు ఒకదాన్ని మించి మరొకటి వ్యవహరిస్తున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు.
కృష్ణా నదిలో ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని అంగీకరించి సంతకం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా.. అని బండి సంజయ్ ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు