అసలు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు అవుతుంది? : హరీశ్రావు డిమాండ్
హైదరాబాద్, 02 జనవరి (హి.స.) ముందుగా మూసీ మోడ్రనైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకసారి సీఎం లక్ష కోట్లని, మరోసారి లక
హరీశ్రావు డిమాండ్


హైదరాబాద్, 02 జనవరి (హి.స.) ముందుగా మూసీ మోడ్రనైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకసారి సీఎం లక్ష కోట్లని, మరోసారి లక్షా 50 వేల కోట్లు అని పలుసార్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, అసలు మూసీ సుందరీకరణ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలనుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుకు తింటారా అని అంటున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్కి బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్నారు.. మరి మూసీ సుందరీకరణ మీద మాత్రం లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు..? అని ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande