
హైదరాబాద్, 02 జనవరి (హి.స.)
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న
రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ఉరి తీయాలని అనడం సరికాదని తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ ఆమె శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన రాజీనామా ఆమోదించాలని కోరేందుకే తాను ఇవాళ శాసనమండలికి వచ్చానని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొట్లాడిన కేసీఆర్ను ఉరి తీయాలని అంటే రక్తం మరుగుతోందని అన్నారు. అలా అయితే రేవంత్ రెడ్డిని ఒక్కసారి కాదు.. రెండు సార్లు ఉరేయాలని కామెంట్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..