ఈసారైనా ప్రిపేర్ అయి రండి ఉత్తమ్ గారు.. ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 02 జనవరి (హి.స.) నది జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి అడ్వైజర్ను పెట్టుకోవాలని, ఈసారైనా అసెంబ్లీకి ప్రిపేర్ అయి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్
ఎమ్మెల్యే సంజయ్


హైదరాబాద్, 02 జనవరి (హి.స.)

నది జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంచి అడ్వైజర్ను పెట్టుకోవాలని, ఈసారైనా అసెంబ్లీకి ప్రిపేర్ అయి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రంతో ఉన్న పంచాయతీ సరిపోదు అన్నట్లుగా నీటి పారుదల శాఖకు ఆంధ్రా అడ్వైజర్ను పెట్టుకున్నారని.. అతన్ని వెంటనే తెలంగాణ సొంతోడు అడ్వైజర్గా పెట్టుకోవాలన్నారు.

రాష్ట్రంలో నూతన సంవత్సరం 'బూతు సంవత్సరం'లా ప్రారంభమైందని, సీఎం రేవంత్ రెడ్డికి సబ్జెక్టుపై అవగాహన లేకనే ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో విషయాలు తక్కువ, బూతులు ఎక్కువగా ఉన్నాయని కామెంట్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande