
హైదరాబాద్, 02 జనవరి (హి.స.)
శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు.
అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు గుప్పించారు. 'రేవంత్ రెడ్డి.. నీకెందుకు అంత భయం?' అంటూ ప్రశ్నించిన కేపీ వివేకానంద, తమ పార్టీ సభ్యులు అసెంబ్లీలో ఏదైనా అంశంపై మాట్లాడుతుండగానే మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..