కేసీఆర్ వదిలిన బాణం.. కవిత వ్యాఖ్యలపై మంత్రి వెంకట్ రెడ్డి కౌంటర్
హైదరాబాద్, 02 జనవరి (హి.స.) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మంత్రి వెంకట్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ వదిలిన
మంత్రి వెంకట్ రెడ్డి


హైదరాబాద్, 02 జనవరి (హి.స.)

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మంత్రి వెంకట్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ వదిలిన బాణం కవిత అని విమర్శించారు. కవిత కన్ఫ్యూజన్ లో ఉండి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తోందన్నారు. కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఊరూరా తిరుగుతోందని, కవిత టీఆర్ఎస్లో ఉందా? బయట ఉందా ఏ పార్టీలో ఉంది స్పష్టం చేయాలని ప్రశ్నించారు.

తన తండ్రి మీద సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కవిత హరీశ్ రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు? అని నిలదీశారు. కేసీఆర్కు దగ్గరగా ఉన్న నాయకులు అందర్నీ దూరం చేసేందుకు కవిత విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande