చిక్కడపల్లి -దోమల గూడ లింక్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, 02 జనవరి (హి.స.) హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిర్భవించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన
మంత్రి పొన్నం


హైదరాబాద్, 02 జనవరి (హి.స.)

హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిర్భవించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ నిధులు రూ.6 కోట్లతో హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా మీదుగా నూతనంగా నిర్మించిన చిక్కడపల్లి -దోమల గూడ లింక్ బ్రిడ్జి ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ ను అనుకుని ఉన్న పురపాలికల విలీనంతో విస్తీర్ణం, జనాభా పరంగా గ్రేటర్ హైదరాబాద్ నగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించిందని అన్నారు. అతి పెద్ద నగరంలో జనాభాకు తగ్గట్టు రోడ్లు, డ్రైన్ లు, వీధి దీపాలు, పార్క్ లు ఇతరత్రా మౌలిక సదుపాయాలు అభివృద్ధి కి సీఎం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande