.గుడివాడ లోని.గుడ్ మెన్ పేటలో. టీడీపీ నేతపై హత్యాయత్నం
గుడివాడ, 02 జనవరి (హి.స.) గుడ్‌మేన్ పేటలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గు‌డ్‌మేన్ పేట సెంటర్‌లో టిడిపి నేత ఇమ్మాన్యూయెల్‌పై కత్తులు, రాళ్లతో మూకుమ్మడి దాడి చేశారు వైసీపీ వర్గీయులు. ఇమ్మ
.గుడివాడ లోని.గుడ్ మెన్ పేటలో. టీడీపీ నేతపై హత్యాయత్నం


గుడివాడ, 02 జనవరి (హి.స.)

గుడ్‌మేన్ పేటలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గు‌డ్‌మేన్ పేట సెంటర్‌లో టిడిపి నేత ఇమ్మాన్యూయెల్‌పై కత్తులు, రాళ్లతో మూకుమ్మడి దాడి చేశారు వైసీపీ వర్గీయులు. ఇమ్మాన్యూయెల్‌ను చంపేందుకు ప్రయత్నిస్తుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారిపైనా వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇమ్మాన్యూయెల్‌తో సహా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి రావడంతో వైసీపీ వర్గీయులు పారిపోయారు. గాయపడిన వారిని హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande