
హుజురాబాద్, 02 జనవరి (హి.స.)
హుజూరాబాద్ నియోజకవర్గం ఒక్కసారిగా ఊటీని తలపించింది. గత రెండు రోజులుగా మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, శుక్రవారం ఉదయం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు దట్టమైన పొగమంచుతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే మంచు తెరలు అలుముకోవడంతో స్థానికులు కాశ్మీర్ లేదా ఊటీలో ఉన్నామా అన్న అనుభూతికి లోనయ్యారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగా సూర్యోదయం తర్వాత వెలుగు వచ్చే సమయానికి కూడా రోడ్లు కనిపించని పరిస్థితి నెలకొంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు