
నల్గొండ, 02 జనవరి (హి.స.)
నల్గొండ జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా చలి తీవ్రతతో పాటు
పొగమంచు విపరీతంగా పెరుగుతుంది. శుక్రవారం ఉదయం నల్గొండ- దేవరకొండ ప్రధాన రహదారి పొగమంచు రోడ్డు పూర్తిగా కమ్మేసింది. ఈ నెల ప్రారంభం నుంచే పెరిగిన చలి తీవ్రత పెరిగింది. దట్టంగా పొగమంచు కురుస్తుంది. వేకువ జామున సమయంలో ప్రయాణాలు సాధించే వాహనదారులతో వ్యాపారస్తులు, ఉద్యోగులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శీతాకాలం కావడంతో ఉదయం సమయంలో కురుస్తున్న పొగమంచు రహదారులను పూర్తిగా కమ్మేస్తుంది. ఉదయం 8:30 దాటిన పొగమంచు తగ్గడం లేదు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు