మలక్పేటలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలు మృతి
హైదరాబాద్, 02 జనవరి (హి.స.) నగరంలోని మలక్పేట ప్రాంతంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు త
రోడ్డు ప్రమాదం


హైదరాబాద్, 02 జనవరి (హి.స.)

నగరంలోని మలక్పేట ప్రాంతంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు తమ కుమార్తెను కలుసుకునేందుకు హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది. మలక్పేట పరిసరాల్లో బైక్పై వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై పడిపోగా, బస్సు వెనుక టైరు వారి మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న మలకే పేట పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande