తిరుమల.లో. భక్తులు రికార్డు స్థాయిలో శ్రీ వారిని దర్శించుకున్నారు
తిరుమల, 03 జనవరి (హి.స.) తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం కల్పించి టీటీడీ మరోసారి చరిత్ర సృష్టించింది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న వేళ, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
తిరుమల.లో. భక్తులు రికార్డు స్థాయిలో శ్రీ వారిని దర్శించుకున్నారు


తిరుమల, 03 జనవరి (హి.స.)

తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం కల్పించి టీటీడీ మరోసారి చరిత్ర సృష్టించింది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న వేళ, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సామర్థ్యానికి అదనంగా 15 వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాటి లెక్కల ప్రకారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని పులకించిపోయారు. ఇది ఇటీవలి కాలంలో అత్యధిక దర్శన సంఖ్యగా నిలిచింది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణ, అన్నప్రసాదం, వైద్య, భద్రతా సేవలను సమన్వయం చేస్తూ టీటీడీ నిరంతరం పర్యవేక్షించింది.

ఇక, స్వామివారికి మొక్కుగా 27,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కళ్యాణకట్ట వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించారు. ఇదే సమయంలో భక్తుల కానుకలతో ఆలయ హుండి ఆదాయం రూ.4.1 కోట్లకు చేరుకుంది. ఇది ఒక్కరోజు లెక్కల్లో చెప్పుకోదగిన మొత్తంగా టీటీడీ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande