మూడో ప్రపంచ తెలుగు మహాసభలు 2026 గుంటూరులో నేడు.ప్రారంభం
అమరావతి, 03 జనవరి (హి.స.): మూడో ప్రపంచ తెలుగు మహాసభలు 2026కు గుంటూరులో ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న మహాసభలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చనతో ప్రారంభమయ్యే ఈ వేడుకను సుప్రీంకోర్టు న
మూడో ప్రపంచ తెలుగు మహాసభలు 2026 గుంటూరులో నేడు.ప్రారంభం


అమరావతి, 03 జనవరి (హి.స.): మూడో ప్రపంచ తెలుగు మహాసభలు 2026కు గుంటూరులో ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న మహాసభలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చనతో ప్రారంభమయ్యే ఈ వేడుకను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్‌ రవీంద్ర కలిసి ప్రారంభించబోతున్నారు.. ప్రధాన వేదికతో పాటు మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు ఇలా ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.. రాత్రి 11 గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని మహాసభల నిర్వాహకుడు, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్ పేర్కొన్నారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande