అడిజన్వడి కర్నూలు కు చెందిన శ్రేయ ఇన్ఫ్రా.మార్కెటింగ్ పై ప్రభుత్వ చర్యలు
కర్నూలు, 03 జనవరి (హి.స.):అధిక వడ్డీ ఆశ చూపి, ప్రజలను మోసగించిన కర్నూలుకు చెందిన శ్రేయ ఇన్‌ఫ్రా అండ్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ సంస్థకు చెందిన 51.55 ఎకరాలు భూమిని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతించింది.
అడిజన్వడి  కర్నూలు కు చెందిన శ్రేయ  ఇన్ఫ్రా.మార్కెటింగ్ పై ప్రభుత్వ చర్యలు


కర్నూలు, 03 జనవరి (హి.స.):అధిక వడ్డీ ఆశ చూపి, ప్రజలను మోసగించిన కర్నూలుకు చెందిన శ్రేయ ఇన్‌ఫ్రా అండ్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ సంస్థకు చెందిన 51.55 ఎకరాలు భూమిని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాలో ప్రజలను మోసం చేసి, దాదాపు రూ.206 కోట్లతో ఆ సంస్థ బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు.. ఆ కేసును సీఐడీకి అప్పగించారు. శ్రేయ సంస్థ నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో 51.55 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.

దాన్ని జప్తు చేయడానికి, దానిపై నియంత్రణకు అనుమతి ఇవ్వాలని సీఐడీ ప్రభుత్వానికి నివేదించింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం శ్రేయ ఇన్‌ఫ్రా సంస్థ భూమిని జప్తు చేసి, తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ తాజాగా జీవో జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande