పాలమూరు ను రాజకీయాల కోసం కేసీఆర్, రేవంత్ వాడుకుంటున్నారు.. డీకే అరుణ!
హైదరాబాద్, 03 జనవరి (హి.స.) పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించింది. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు.. పవర్ పాయింట్ ప్రజెంటేష
డీకే అరుణ


హైదరాబాద్, 03 జనవరి (హి.స.)

పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్

రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించింది. పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లతో ఒకరిపై ఒకరు నేపం నెట్టుకునే ప్రయత్నం తప్ప ఏం లేదు.. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారేనని మండిపడింది. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని ఉన్న మొదటి DPR ప్రకారం తీసుకోవాలని అనేక సార్లు చెప్పడం జరిగింది.. పాలమూరు రైతులతో ఆట ఆడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించింది.

ఇక, మాయ మాటలతో, మోసం చేసి.. మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులను వాళ్ళపై నెట్టి తప్పించుకోవాలని కాంగ్రెస్ నాటకం ఆడుతుంది. ఇద్దరు ఆడుతున్న నాటకంలో పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. పాలమూరు ప్రజలను పదేళ్లు కేసీఆర్ మోసం చేశారనే.. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు.. జూరాల అప్రోచ్ అయితేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పుకొచ్చింది. జూరాల నుంచి నీళ్లు తీసుకోవడానికి ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదు.. డిండి ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకెళ్లడంతో పాలమూరు ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande