
భద్రాచలం, 03 జనవరి (హి.స.) భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి
వారి దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి నాడు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనం రోజు రూ.60,19,830లు ఆదాయం లభించినట్లు రామాలయం అధికారులు తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం కొరకు విక్రయించిన పలు సెక్టార్ టికెట్స్ 98.48 శాతం అమ్ముడుపోయాయి అని తెలిపారు. పరోక్ష సేవలు, స్పెషల్ దర్శనం, ప్రసాదం విక్రయాలు ద్వారా ఈ ఆదాయం లభించినట్లు ఈవో దామోదర్ రావు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు