పెట్టుబడులే లక్ష్యంగా దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్!
హైదరాబాద్, 03 జనవరి (హి.స.) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్, యూఎస్ పర్యటన ఖరారు అయినట్లు సమాచారం. పెట్టుబడుల సమీకరణ కోసం వారు మరోసారి విదేశాలకు వెళ్ళనున్నారు. ఈనెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లోని దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యట
సీఎం రేవంత్


హైదరాబాద్, 03 జనవరి (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దావోస్, యూఎస్ పర్యటన ఖరారు అయినట్లు సమాచారం. పెట్టుబడుల సమీకరణ కోసం వారు మరోసారి విదేశాలకు వెళ్ళనున్నారు. ఈనెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లోని దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని తెలుస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా అక్కడ జరిగే పెట్టుబడుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

అనంతరం అక్కడి నుంచే నేరుగా అమెరికా పర్యటనకు ఆయన వెళ్తారని తెలుస్తోంది. ఈ మేరకు విదేశీ పర్యటన షెడ్యూల్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ షెడ్యూల్ ఖరారు అయితే ఆయన ఫిబ్రవరి ఒకటో తేదీన తిరిగి హైదరాబాద్ కు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande