
హైదరాబాద్, 03 జనవరి (హి.స.)
హైదరాబాద్ మహానగరాన్ని కాంగ్రెస్
ప్రభుత్వం అడ్డగోలుగా విభజిస్తోందని, కనీస శాస్త్రీయ అధ్యయనం లేకుండా గూగుల్ మ్యాప్స్ ఆధారంగా డివిజన్లను మారుస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇవాళ మీడియాతో ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు ఘనమైన చరిత్ర ఉందన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతోందని అన్నారు. సికింద్రాబాద్ సంస్కృతిని, దాని ఉనికిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. అడ్డగోలు విభజనను తాము అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. సికింద్రాబాద్కు ప్రత్యేకంగా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు