
హైదరాబాద్, 03 జనవరి (హి.స.)
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్ నిర్వహిస్తే సభకు హాజరుకాబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాసిన లేఖ గుర్తుందా అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా 30-03-2016 న మీరు స్పీకర్కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా? అని నిలదీశారు. అసెంబ్లీలో ఆడియో-విజువల్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తే, అది భారత దేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. అందుకే మేము సభకు హాజరుకాబోము.” అని నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా లేఖ రాసి.. నేడు మంత్రి హోదాలో అసెంబ్లీ హాలులో ప్రజెంటేషన్కు సిద్ధపడటం.. మీ రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు