హ్యాష్ ఆయిల్ స్థావరంపై పోలీసులు దాడి.. ముగ్గురు అరెస్ట్
మేడ్చల్ మల్కాజిగిరి, 03 జనవరి (హి.స.)హ్యాష్ ఆయిల్ విక్రయ స్థావరంపై మేడ్చల్ జిల్లా ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి సుమారు రూ.8 లక్షల విలువైన ఒక కేజీ హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను దుండిగల్ పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన దుండ
హ్యాష్ ఆయిల్


మేడ్చల్ మల్కాజిగిరి, 03 జనవరి (హి.స.)హ్యాష్ ఆయిల్ విక్రయ స్థావరంపై మేడ్చల్ జిల్లా ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి సుమారు రూ.8 లక్షల విలువైన ఒక కేజీ హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను దుండిగల్ పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి హ్యాష్ ఆయిల్ తెప్పించి గండిమైసమ్మ చౌరస్తాలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు తెలిపారు. హ్యాస్ ఆయిల్ ను ఒడిశా రాష్ట్రం నుంచి బల్క్ లో తెప్పించి చిన్న చిన్న బాటిల్స్ లో నింపి ఒక్కో బాటిల్ ను ఐదు వందల చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు, ఒడిశా రాష్ట్రానికి చెందిన నిందితులు సునీల్ కుమార్(34), చింటూ(27), సూర్య కాంత్ (26) లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande