
హైదరాబాద్, 03 జనవరి (హి.స.)
ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చేందుకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలను, వేల మంది ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు.
నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ల నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు