రైతులకు సరిపడా యూరియా ఉంది.. నాగర్ కర్నూల్ కలెక్టర్
నాగర్ కర్నూల్, 03 జనవరి (హి.స.) రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 38 వేల 667 బస్తాల యూరియా నిల్వ ఉందన్నారు. రైతులు ఎవరూ ఆ
నాగర్ కర్నూల్ కలెక్టర్


నాగర్ కర్నూల్, 03 జనవరి (హి.స.)

రైతులకు సరిపడా యూరియా

అందుబాటులో ఉందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 38 వేల 667 బస్తాల యూరియా నిల్వ ఉందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందకుండా అవసరం మేరకు ఉపయోగించాలని సూచించారు. అంతేకాకుండా జిల్లాలోని రైతులందరికీ యూరియా అందించడమే లక్ష్యంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande