మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీ చేసిన నల్గొండ కలెక్టర్
నల్గొండ, 03 జనవరి (హి.స.) నల్గొండ మున్సిపల్ వార్డులలో శనివారం ఉదయమే జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపాలిటీ ద్వారా నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా ప
నల్గొండ కలెక్టర్


నల్గొండ, 03 జనవరి (హి.స.)

నల్గొండ మున్సిపల్ వార్డులలో శనివారం ఉదయమే జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపాలిటీ ద్వారా నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా పై ఆరా తీసి పారిశుధ్యం, మురికి కాలువల పరిశుభ్రతను పరిశీలించారు. డ్రైన్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వీధుల్లో చెత్త పోస్తే జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసి, మోతి కుంట బండ్ పునరుత్తేజానికి చర్యలు తీసుకుంటామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande