
జగిత్యాల, 03 జనవరి (హి.స.)
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామిని టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుతో కలిసి దర్శించుకున్నారు. మొదట హెలికాప్టర్ ద్వారా జేఎన్టీయూ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేరుగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ టిటిడి సహకారంతో రూ 35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 96 వసతి గదులు, ఒకేసారి రెండు వేల మంది దీక్షాపరులు మాల విరమణ చేసేలా విరమణ మండపాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టడం హర్షనీయం అన్నారు. కొండగట్టు గిరి ప్రదక్షణకు మార్గం సుగమం చేసేందుకు అవసరమైతే తానే స్వయంగా కర సేవకుడిని అవుతానని మాట ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు