
గుంటూరు, 03 జనవరి (హి.స.)ఆంధ్రా సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శివారులో గల శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీ ప్రాంగణంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీనివాస కల్యాణంతో ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘురాం, విశ్వయోగి విశ్వంజీ, తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ తదితరులు తెలుగు మహాసభలకు హాజరయ్యారు. ఆధ్యాత్మిక వేదికలో కన్నుల పండువగా, వైభవంగా జరుగుతున్న శ్రీనివాస కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు.
తెలుగు మహాసభల్లో ప్రతిష్టాత్మక పురస్కారాలు
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నేటి నుంచి మూడురోజులపాటు జరగనున్నాయి. ఈ సభల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాలు, సారస్వత సేవా పురస్కారాలు, జీవన సాఫల్య పురస్కారాలను.. పురస్కార గ్రహీతలకు నిర్వాహకులు ప్రదానం చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV