తుర్క్‌మన్‌ గేట్’ అల్లర్లలో 30 మంది గుర్తింపు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్
తుర్క్‌మన్‌ గేట్’ అల్లర్లలో 30 మంది గుర్తింపు


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ.,08జనవరి (హి.స.)దేశరాజధాని ఢిల్లీలోని తుర్క్‌మన్‌ గేట్ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించారు. ఐదుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

ఈ అల్లర్లకు సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు సోషల్ మీడియాలో కనిపిస్తున్న సుమారు 400 వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులు, పోలీసులు ముఖాముఖి తలపడిన దృశ్యాలు ఈ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకలు పోలీసులపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేస్తున్న దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆ వీడియోల ద్వారా మరికొంతమందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande