
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,08జనవరి (హి.స.): ప్రభుత్వ ఉద్యోగాల పేరిట అక్రమార్కులు సాగిస్తున్న భారీ మనీలాండరింగ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. నేటి (గురువారం) ఉదయం నుంచి దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్, మోతీహరి, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, కేరళలోని ఎర్నాకులం, పందళం, తమిళనాడులోని చెన్నై, గుజరాత్‌లోని రాజ్‌కోట్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, లక్నో తదితర నగరాల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ