
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,08జనవరి (హి.స.): గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంపై భాజపా, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మహమ్మద్ గజినీ, అల్లావుద్దీన్ ఖిల్జీలు సోమనాథ్ ఆలయాన్ని కూలగొట్టి, అందులోని సంపదను దోచుకోగా, స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని నెహ్రూ సోమనాథుడిని అమితంగా ద్వేషించారని భాజపా జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది బుధవారం ‘ఎక్స్’లో ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. 1951లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్‌కు రాసిన లేఖలో సోమనాథ్ ఆలయ విధ్వంసం జరిగిందనడం వట్టి బూటకమని నెహ్రూ వర్ణించారని త్రివేది ఆరోపించారు. ఇది మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ఠ అని విమర్శించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం విదేశాలలో భారత్ ప్రతిష్ఠను మంటగలిపిందంటూ నెహ్రూ ముఖ్యమంత్రులందరికీ రెండుసార్లు లేఖలు రాశారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ