
ఢిల్లీ, 08 జనవరి (హి.స.)
అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్. జనవరి 8న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో స్పేస్‌వాక్ జరగనుంది. అయితే ఈ ఏడాదికి చెందిన తొలి స్పేస్‌వాక్ ఇదేనని నాసా పేర్కొంది. ఈ స్పేస్‌వాక్‌లో నాసాకు చెందిన వ్యోమగాములు మైక్ ఫిన్కే, జెనా కార్డ్‌మన్ పాల్గొంటారు. మైక్ ఫిన్కేకు ఇది 10వ స్పేస్‌వాక్ కాగా జెనా కార్డ్‌మన్‌కు ఇది మొదటిది కావడం విశేషం. ఈ స్పేస్‌వాక్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 PM IST మొదలై.. సుమారు ఆరున్నర గంటలపాటు కొనసాగుతుంది.
ఇందులో ISS పవర్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన పనులు, కొత్త సోలార్ ప్లేట్స్ కు కేబుల్స్ అమరిక, జంపర్ కేబుల్స్ ఇన్‌స్టాల్ చేయడం, స్టేషన్ హార్డ్‌వేర్ ఫోటోలు తీయడంతోపాటు.. అంతరిక్ష కేంద్రం బయట ఉన్న సూక్ష్మజీవుల నమూనాలు సేకరించడం వంటి ముఖ్యమైన పనులు చేయనున్నారు. ఈ స్పేస్‌వాక్‌ను నాసా యాప్, నాసా యూట్యూబ్ చానల్, నాసా టీవీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్‌గా చూడొచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV