
అమరావతి , 10 అక్టోబర్ (హి.స.)దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) 5,261 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి 25 వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సేవలను అందుబాటులోకి ఉంటాయని అధికారులు తెలిపారు.
దసరా పండుగ సమయంలో ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు తమ స్వస్థలాలకు వెళ్లడం సాధారణం. పండుగ సెలవులు, కుటుంబ కార్యక్రమాలు, దేవాలయాల సందర్శనలు కారణంగా బస్సులు, రైళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో సాధారణ సర్వీసుల్లో సీట్లు లభించకపోవడం, బస్టాండ్లలో రద్దీ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు కూడా ఈ సేవలను అనుసంధానించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్