
అమరావతి, 10 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్(ఏపీసీసీ) వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు.
విజయవాడలో నేడు ఇండియా కూటమి పార్టీలు ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో భాగంగా ఉదయం 10 గంటలకు విజయవాడలోని లెనిన్ సెంటర్ నుంచి లోక్ భవన్ (రాజ్ భవన్) వైపు భారీ మార్చ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ ఛలో రాజ్ భవన్ నిరసన కార్యక్రమానికి అధికారికంగా అనుమతులూ లేవని పోలీసులు స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు.
ఇప్పటికే రాజ్ భవన్ వద్ద సైతం భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఉదయం నుండే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్(ఏపీసీసీ) వైఎస్ షర్మిల నివాసం వద్ద పోలీసులు మోహరించడంతో ఆమె బయటకు వస్తారా లేదా.. ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇతర ప్రాంతాల నుండి సైతం వామపక్ష, కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV