
తిరుపతి, 10 అక్టోబర్ (హి.స.)
తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు మండలం పరిధిలోని చిన్న సింగమాల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో
హైవేపై లారీ, టిప్పర్ రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
తిరుపతిజిల్లా పోలీసులు, స్థానికుల కథనం మేరకు తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు పరిధిలోని చిన్నసింగమాల సమీపంలో హైవేపై ప్రమాదవశాత్తు రెండు వాహనాలు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మంజునాథ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV