మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో వర్షాలు కురుస్తాయని ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రస్తుతానికి ఎండల నుంచి ఉపశమనం లభించడం లేదు.
heavy-rain-waterlogging-mandya-highway


అమరావతి, 10 అక్టోబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో వర్షాలు కురుస్తాయని ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రస్తుతానికి ఎండల నుంచి ఉపశమనం లభించడం లేదు.

పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతుండగా, కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాస్త ఊరటనిచ్చేలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి... ఇది వాయుగుండంగా మారి భారీ వర్షాలను కురిపిస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.

ఉత్తర అండమాన్ సముద్రంలో అభివృద్ధి చెందుతున్న ఉపరితల ప్రసరణ ప్రభావం కారణంగా.. మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాబోయే 3-4 రోజుల్లో బలపడి, పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరాల వైపు కదలవచ్చని అంచనా వేసింది. బుధవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలో వాతావరణ స్థితిగతులు తెలంగాణ వ్యాప్తంగా రాగల 24 గంటల్లో వాతావరణం సాధారణం కంటే చల్లగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ మరియు తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, వరంగల్ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఆకాశం మేఘావృతమై ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశముంది. రైతులు కోత దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడా జల్లులుఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పగటి వేడి కొనసాగుతున్నట్లు వాతావరణ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. . ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటూ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande