
హైదరాబాద్ , 11 అక్టోబర్ (హి.స.)సికింద్రాబాద్లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారి అదృశ్యమై, అనంతరం మృతదేహంగా కనిపించిన ఘటన తెలంగాణలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. కౌకూర్ ప్రాంతంలోని విల్లా ఆర్కిడ్స్లో నివసిస్తున్న చిన్నారి అదృశ్యమైన కేసులో అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
చిన్నారి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. చిన్నారి వెనుక అనుమానిత వ్యక్తి వెళ్తున్న దృశ్యాలు లభించింది.
చిన్నారి అదృశ్యమైనట్లు సమాచారం అందిన వెంటనే పరిసర ప్రాంతాల్లో గాలింపు, సీసీటీవీ ఫుటేజీ పరిశీలన, అనుమానితుల కదలికల విశ్లేషణ వంటి చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్